బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినా అవకాశం లభించలేదని లేఖలో పేర్కొన్నారు. గోషామహాల్ అసెంబ్లీలో అభివృద్ధి, పనుల అనుమతికి సీఎంను కావాలని చాలా మార్గాల ద్వారా విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు.
తనను కలుస్తానని సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ రాలేదన్నారు రాజాసింగ్. మజ్లీస్ ఎమ్మెల్యేలకు వందల కోట్ల పనులు మంజూరు అవుతున్నాయని.. గోషామహాల్ లో మాత్రం ఒక్క పని కూడా మంజూరు కాలేదన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలను కలవరా అంటూ ప్రశ్నించారు రాజాసింగ్. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో లేదా లేదా అని మండి పడ్డారు. అన్ని ప్రాంతాల లాగే గోషామహాల్ ను చూడాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గంలో ప్రజలు కూడా తమకు ఓట్లు వేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్దే ద్యేయం అని చెప్పే సర్కారు.. మాటలే తప్ప చేతలకు పనికిరాదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఎంత కాలం ఈ దొరపోకడ సాగిస్తారని నిలదీశారు రాజాసింగ్.