బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు. తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో హరీష్ రావు ప్రవేశపెడుతుండగా అడ్డుపడ్డారు ఎమ్మెల్యేలు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని తీర్మానం చేయగా.. సభ ముగిసే వరకు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ పై సస్పెన్షన్ వేటు పడింది.
ఇక 2022-23 తెలంగాణ బడ్జెట్ ను రూ.2.56 లక్షల కోట్లతో తయారు చేశారు. రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు కాగా.. క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు.
తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న హరీష్ రావు.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు అడిగినా ఇవ్వలేదని విమర్శించారు. విభజన హామీలు కూడా అమలు చేయట్లేదన్నారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోందన్న మంత్రి.. సీఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.