సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు అనేది సీఎం కేసీఆర్ మాయ అని ఆయన ఆరోపించారు. దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం కాళ్లు మొక్కి మరీ సీఎంఅర్ఎఫ్ ఇప్పించాల్సిన ఖర్మ ఏంటి మంత్రి? అని ఆయన మండిపడ్డారు. అందుకేనా ప్రజలు ఓట్లేసింది? అని ఆయన ప్రశ్నించారు. జగిత్యాలలో 40 శాతం డబుల్ బెడ్ రూం ఇండ్లను ముస్లింలకు ఇచ్చారని ఆయన అన్నారు.
అసెంబ్లీ పరిధిలో 10 శాతం జనాభా లేని ముస్లింలకు 40 శాతం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ 15 నెలల కాలంలో తన ఫౌండేషన్ నుంచి రూ. 29 లక్షలను బూత్ లెవల్ కార్యకర్తలకు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో చేసేది ఏమీ లేదనట్టుగా బీఆర్ఎస్ పేరిట ఇప్పుడు దేశంలో తిరుగుతారంట ఆయన ఎద్దేవా చేశారు. మూడేండ్లుగా తెగుళ్ల బారిన పడటంతో పసుపు నాణ్యత చాలా ఘోరంగా పడిపోయిందన్నారు. ఫసల్ బీమా పెట్టి ఉంటే రైతులకు ఈ సమయంలో మేలు జరిగేదని ఆయన వెల్లడించారు.