సీఏఏను వ్యతిరేకించే వారిని బ్రేకుల్లేని బస్సులో పాకిస్తాన్ పంపేయాలంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పచ్చ జెండాలతో ఓరుగల్లును అపవిత్రం చేశారని, అందుకే కాషాయ జెండాతో ఈ గడ్డను పవిత్రం చేస్తున్నామంటూ ర్యాలీ తీశారు. ప్రణాళిక ప్రకారమే దేశంలో విచ్ఛిన్నం జరిపేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు చూస్తున్నారని, ఇస్లామిక్ దేశాల నుండి వస్తున్న డబ్బులతో ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.
లుంబిని పార్క్‌లో బాంబులు వేసిన వారికి పౌరసత్వం ఇవ్వాలా అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. 10నిమిషాల్లో హిందువులను ఖతం చేస్తానంటూ ఓవైసీ మాట్లాడినప్పుడు కేసీఆర్ ఎక్కడికి పోయావ్, మున్సిపాలిటీ ఓట్ల కోసమే నిజమైన హిందువు మా నాన్న అనడానికి సిగ్గుండాలని కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. సీఎం కావడానికే కేటీఆర్ తిరుపతి వెళ్లాడని విమర్శించారు.
ఓవైసీ బ్రదర్స్, కేసీఆర్ ఆటలు ఇక తెలంగాణలో సాగవని, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే అని ఎంపీ సంజయ్ ఆరోపించారు.