గుండెపోటు తో చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో జరిగిన దాడి పై స్పీకర్ ఓంబిర్లాకు పిర్యాదు చేశారు ఎంపీ బండి సంజయ్. తన పై పోలీసులు కావాలనే అత్యుత్త్సహంతో చెయ్యిచేసుకున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు సంజయ్. దాడికి సంబందించిన ఫోటోలు, వీడియో లు స్పీకర్ కు సమర్పించారు. తనపై దాడి చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ స్పీకర్ ని కోరారు.
సరూర్ నగర్ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమరభేరి సభ లో డ్రైవర్ బాబు గుండెపోటు వచ్చి మృతి చెందిన సంగతి తెలిసిందే.