బండి సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన పాదయాత్ర కమిటీ సభ్యులు.. రూట్ మ్యాప్, సమావేశాలు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు.
గోల్కొండ కోట, మైసమ్మ దేవాలయం, మొయినాబాద్ క్రాస్ రోడ్, చేవెళ్ల క్రాస్ రోడ్, వికారాబాద్, మొమిన్ పేట, సదాశివపేటల మీదుగా పాదయాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. యాత్రలో భాగంగా బండి సంజయ్ ఎక్కడ ఆగాలి.. ప్రజలను ఉద్ధేశించి ఎక్కడ ప్రసంగించాలి.. ఇలా అన్నింటికీ అనువైన ఏరియాలను గుర్తించారు.
బండి పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లు, జన సమీకరణ వంటి బాధ్యతలను స్థానిక కార్యకర్తలకు అప్పగించారు బీజేపీ నేతలు. పార్లమెంట్ సమావేశాలు, కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర కారణంగా బండి పాదయాత్ర వాయిదా పడింది. 24 నుంచి ఆయన యాత్ర చేపట్టనున్నారు.