ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సెటైర్లు వేసారు. కేసీఆర్ రాత్రి పూట కాకుండా పగటి సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని ఎద్దేవా చేశారు. రాత్రి సమయంలో తీసుకున్న నిర్ణయం కాబట్టే.. రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గాల్సి వచ్చిందని విమర్శించారు. బీజేపీ ఆందోళనతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని ఆయన అన్నారు.
ప్రజలు కేసీఆర్ పాలనను చీదరించుకుంటున్నారని బండి విమర్శించారు. కేసీఆర్ తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని..గడీ గోడలు బద్దలు కొడతామని అన్నారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీ మలి దశ ఉద్యమం ప్రారంభించబోతుందని బండి సంజయ్ తెలిపారు.