బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న రామ్ సేతు చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తాజాగా ఈ మూవీపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు పిటిషన్ ను తాజాగా ఫైనల్ చేసినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రంలో రామసేతును తప్పుగా చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమా ద్వారా రామసేతుపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీపై తాను పిటిషన్ వేస్తున్నట్టు ఆయన ట్వీట్ లో వెల్లడించారు.
ఈ చిత్రం ద్వారా కలుగుతున్న నష్టానికి నష్ట పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు అక్షయ్ కుమార్, కర్మ మీడియాపై దావా వేస్తున్నట్టు చెప్పారు. 2007లో రామసేతుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను స్వామి తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Advertisements
ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వచ్చేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో స్వామి పిటిషన్ పై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.