ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు. ఇక్కడ పని చేసిన బిశ్వభూషన్ హరిచందన్ కు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా ఆయన వైసీపీ పై విమర్శలు కురిపించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారని విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలకు భవిష్యత్తులో తప్పకుండ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. కేంద్ర అవసరమైన నిధులన్నింటిని ఇస్తున్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అలాగే నిధులను వాడుకుంటుందని తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చినా కూడా జగన్ ప్రభుత్వం చేతకానితనంతో నిర్లక్ష్య ధోరణితో ఉందని పేర్కొన్నారు. ఎప్పుడో మంజూరు చేసిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా.. లేక ప్రజలకు మేలు చేసే మనసు లేదా అంటూ ప్రశ్నించారు.
కనీస బాధ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్ఆనరు. ఏపీకి ఏడు వేల కోట్ల అదనపు సాయం లభించినా..అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. జగన్ కు రాష్ట్ర అభివృద్ధి పై చిత్తశుద్ది లేదని.. ఏపీలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.
కాపులను వైసీపీ, టీడీపీలు మోసం చేశాయని విమర్శించారు. ఆదివారంనాడు విశాఖపట్టణంలో జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు. కాపులకు జరిగిన అన్యాయం దేశంలో ఏ వర్గానికి జరగేలేదన్నారు. కాపుల రిజర్వేషన్లను అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాపు రిజర్వేషన్ల అంశంపై టీడీపీ సర్కార్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్లకు అవసరమైన భూ సేకరణలో ఏపీ సర్కార్ మీన మేషాలు లెక్కిస్తుందని ఆయన విమర్శించారు. విశాఖలో పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూ సేకరణ ఎంతవరకు వచ్చిందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎక్కడ భూదోపీడీ, కుంభకోణాలు చేసేందుకు అవకాశం ఉందో చూసి అక్కడే వైసీపీ సర్కార్ పనులు చేస్తుందని జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. ఈ ఏడాది మార్చి మాసంలో విశాఖపట్టణంలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏం చెబుతారని జీవీఎల్ ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్లను ప్రారంభించలేకపోయామని చెబుతారా ప్రభుత్వాన్ని అడిగారు జీవీఎల్ నరసింహరావు. రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు పరిశ్రమలను వెళ్లగొట్టడంలో తాము సిద్దహస్తులమని పెట్టుబడిదారుల సమావేశంలో చెబుతారా అని జగన్ సర్కార్ పై జీవీఎల్ నరసింహరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి మాసంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్ నిర్వహించడానికి ముందే విశాఖకు రాజధానిని తరలించాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. మార్చిలో విశాఖలో జరిగే సమావేశానికి ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.