ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య జరుగుతున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. అయితే మిత్రపక్షం బీజేపీ.. జనసేన కు మద్దతుగా నిలిచింది. వైసీపీ నేతలు పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నట్లు చెప్పారు జీవీఎల్. విమర్శను తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలన్నారు. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకమని చెప్పారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలని సెటైర్లు వేశారు జీవీఎల్ నరసింహారావు.
ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జీవీఎల్ వ్యాఖ్యలను సమర్ధించారు. ఆయన చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారాయన.