బీజేపి ఎమ్.పి కె.లక్ష్మణ్ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేసారు. తెలంగాణా పోరాటంలో ఆత్మత్యాగం చేసిన శ్రీకాంత్ చారి వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలోని భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతుందని మండిపడ్డారు. తమ అవినీతి కార్యక్రమాలన్నీ బైటపడాయనే భయంతోనే సీబీఐని రావొద్దంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రఇచ్చిన నిధులన్నీ అవినీతిదారి మళ్ళిస్తున్నారని, స్కీములన్నీ స్కాములుగా మార్చేస్తున్నారని యద్దేవాచేసారు. అభివ్రుద్ధి మరచి స్వలాభంకోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నందుకు ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి ఆత్మఘోషిస్తుందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులకు కేంద్రప్రభుత్వానికి ఏమాత్రం సంబంధంలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలంటూవస్తే సీఎమ్ కూతురైనా..ఎవరైనా తమనిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిందేనన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అందరూ సమానమేనని స్పష్టంచేసారు. తెలంగాణాలో గల్లీగల్లీకో మద్యం దుకాణం పెట్టి, తెలంగాణా రాష్ట్రాన్నికాస్తా తాగుబోతుల రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం తీవ్రంగా క్రుషిచేందని ఎమ్.పి లక్ష్మణ్ యద్దేవాచేశారు.
“తెలంగాణా ప్రజల ప్రయోజనాల ద్రుష్ట్యా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా..ప్రజా విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. డబుల్ బెడ్ రూం. ఇళ్ళు,దళితులకు మూడెకరాల భూమి హామీలను విస్మరించారు.ప్రభుత్వ భూములన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి.పేదవాడు వందగజాల స్థలాన్ని కూడా కొనకుండా విపరీతంగా ధరలు పెంచారు. ప్రాజెక్టుల పేరుతో పెద్దఎత్తున అవినీతి జరిగింది. అవినీతి సొమ్ముతో రాజ్యమేలాలని చూస్తున్నారు.కేసీఆర్ కుటుంబం చేసే అవినీతికి అడ్డుకట్టవేయకుండా ఉండేందుకు సీబీఐని తెలంగాణాకు రానియ్యం అంటున్నారు. “ – కె.లక్ష్మణ్ బీజేపీ ఎంపీ