హిజాబ్ పై బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యా్ఖ్యలు చేశారు. భారత్ లో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదన్నారు. మీరు మీ ఇండ్లలో మాత్రమే హిజాబ్ ధరించండని అన్నారు.
భోపాల్ లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె… ‘ పాఠశాలలకు వెళ్లినప్పుడు విద్యార్థులు యూనిఫామ్ మాత్రమే ధరించాలి. విద్యాసంస్థలు సూచించిన ప్రకారం క్రమశిక్షణగా ఉండాలి” అని అన్నారు.
గురుకులాల్లో భాగ్వా(కాషాయ వస్త్రాలు) ధరించడంతో పోల్చడంపై ఆమె స్పందిస్తూ.. ‘ హిజాబ్ అనేది తెల్ల వెంట్రుకలను కవర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారని అన్నారు. హిజాబ్ అనేది ఒక పర్దా. మిమ్ముల్ని చెడు దృష్టితో చూసే వారిపై పర్దాను ఉపయోగించాలి” అన్నారు.
‘ హిందువులు స్త్రీలను గౌరవిస్తారు. వారు ఏ మహిళను చెడు భావనతో చూడరు. స్త్రీలను పూజించడం సనాతనంగా వస్తున్న ఆచారం. స్త్రీని అత్యున్నతంగా గౌరవించే ఇలాంటి దేశంలో హిజాబ్ ధరించడం అవసరమా.. మన దేశంలో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు.