జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే దేశభక్తుడని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరో సారి వివాదానికి తెరలేపారు. ఈరోజు లోక్ సభలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే సభ్యుడు ఎ.రాజా మాట్లాడుతూ నాథూరామ్ గాడ్సే మహాత్మాగాంధీని ఎందుకు చంపారో చెబుతుండగా బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మధ్యలో అడ్డుపడుతూ ‘దేశభక్తుడి గురించి ఏమి చెప్పలేవు అన్నారు.
రాజా ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. బీజేపీ సభ్యులు వారిని నచ్చజెప్పి శాంతింపజేశారు.
అనంతరం రాజా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ…నాథూరామ్ 32 ఏళ్ల క్రితమే మహాత్మాగాంధీపై కక్ష పెంచుకొని చివరకు హత్య చేసినట్టు అతనే అంగీకరించాడని…తాను నమ్మిన సిద్దాంతం కోసం హత్య చేసినట్టు రాజా చెప్పాడు. సెక్యూర్టీ అనేది భద్రతా కోణం నుంచి చూడాలని..రాజకీయ కారణాల కోణంతో కాదని… ప్రధాన మంత్రి తప్ప ఇతరుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీ తొలగిస్తూ చేసిన సవరణ బిల్లును మరోసారి పరిశీలించాలని ఎ.రాజా కోరారు