ప్రతిపక్షాల విమర్శలకు అదిరిపోయే కౌంటర్స్ ఇస్తూ, తన వాక్చాతుర్యంతో మెప్పించే బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండబోతున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ ఇంచార్జీలకు కృష్ణదాస్‌లకు లేఖ రాశారు.
ఇటీవల రఘునందన్ రావుపై అత్యాచార కేసు నమోదు అయింది. గత 12 ఏళ్లుగా రఘునందన్ రావు బెదిరిస్తున్నారని, కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని జ్యోతినగర్ కు చెందిన మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్‌సీపురం పోలీసులు రఘునందన్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు.
రఘునందన్ రావుపై అత్యాచార ఆరోపణల కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో తనపై వచ్చిన ఆరోపణలు కోర్టు నుండి రిలీఫ్ వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకున్నానని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖ రాశారు.
లేఖలో రఘనందన్ రావు ఏం చెప్పారంటే…
Advertisements