ఉక్రెయిన్ సంక్షోభం వేలాది మంది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. ఉక్రెయిన్ నుంచి విద్యా్ర్థులు ఎదుర్కొంటున్న అనిశ్చితిపై ఆయన ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్ సంక్షోభం వేలాది మంది విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసిందన్నారు. ఒకవైపు, వారికి యుద్ధభూమిలో చేదు జ్ఞాపకాలు ఉన్నాయని, మరోవైపు, వారి భవిష్యత్తు సంశయంలో పడిందన్నారు.
‘ అందువల్ల వారికి భారతీయ విద్యాసంస్థల్లో వసతి కల్పించేందుకు నిబంధనల్లో సడలింపులు చేయాలి. విద్యార్థుల, వారి తల్లిదండ్రుల బాధలు మన బాధలు కావాలి” అని అన్నారు.
ఉక్రెయిన్ లో 15000 మందికి పైగా భారతీయులు చిక్కుకున్నారని ప్రభుత్వం గత వారం చెప్పింది. దీనిపై వరుణ్ గాంధీ స్పందిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.