మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల మధ్య నడుస్తోన్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అంతేకాదు ఇవన్నీ ప్రత్యక్ష చర్యల వరకు వెళ్లాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు ముంబైలోని ఈడీ కార్యాలయానికి బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్ అంటూ ప్లెక్సీ కట్టారు. ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పీఎంసీ బ్యాంకు నగదు అక్రమ రవాణా కేసులో శివసేన ఎంపీ సంజయ్ రావుత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో శివసేన మండిపడుతుంది. బీజేపీ ఈడీని ఉసిగొల్పుతుందని ఆరోపించారు. మహారాష్ట్రలో సంకీర్ణ కూటమిని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, సంవత్సరకాలం తమను బెదిరిస్తూనే ఉన్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇలాంటి చర్యలకు శివసేన భయపడదంటూ ఆధిత్య థాక్రే హెచ్చరించారు.
గత ఏడాది అక్టోబర్‌లో పంజాబ్, మహారాష్ట్ర కార్పొరేషన్ బ్యాంకులో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది.