మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన కామెంట్ల దుమారం రేపుతోంది. ఆమె సారీ చెప్పినప్పటికీ అతివాద సంస్థలు వినకుండా.. బీజేపీ, హిందూ సంస్థల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సారి ఒకడుగు ముందుకేసి హౌరాలోని ఉలుబెరియా ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత అనిర్బన్ గంగూలీ ట్విట్టర్ లో షేర్ చేశారు. నిప్పు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనకారులు, రాళ్లు రువ్విన వారిపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్ ప్రభుత్వం ఎందుకు పట్టిపట్టు వ్యవహరిస్తోందని గంగూలీ ప్రశ్నించారు.
తమ పార్టీ ఆఫీసు విధ్వంసం కావడానికి టీఎంసీ కారణం అని బీజేపీ నేత సువేంద్ అధికారి ఆరోపించారు. అల్లరిమూకలకు దీదీ సర్కార్ అండగా నిలుస్తోందని చెప్పారు. అందుకే వారు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు హౌరాలో చెలరేగిన హింసాత్మక ఘటనలను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు.
ఆందోళనకారులు రహదారి, రైలు మార్గాలను మూసివేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ.. చెంగల్ స్టేషన్ వద్ద ఆందోళనకారులు నిరసనకు దిగారు. దీంతో ఆగ్నేయ రైల్వే మార్గంలో రైళ్లను నిలిపివేశారు.