పోలవరం ప్రాజెక్ట్ బహుళార్ధ ప్రాజెక్టుగా..అతిపెద్ద జాతీయ ప్రాజెక్ట్ పేరుగాంచింది తప్ప, పూర్తి కాలేని పరిస్థితి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వేగంగా పనులు పూర్తి చేసుకుంటూ రూపురేఖలు తయారయిన పోలవరం ప్రాజెక్టు పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు మారడం అంటూ చెపుతున్నారు స్థానిక రైతన్నలు..
తెలుగు దేశం పార్టీ చంద్రబాబు అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం లేకపోయినా రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టి పూర్తయ్యే దిశగా తీసుకువెళ్లినా… నూతనంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు వేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని నిర్మాణ వ్యయం పెంచారని చంద్రబాబు కాంట్రాక్టరుతో లాలూచీ అయ్యారని పోలవరం హెడ్ వర్క్ లో లెక్కలు తేల్చాలని పోలవరం నిర్మాణాన్ని ఆపేసి.. ప్రస్తుతం జగన్ పోలవరంపై యాక్షన్ ప్లాన్ నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర స్వరూపమే మారిపోతుందని పెద్దల మాట. అటువంటి ప్రాజెక్టు పనులు ఐదు నెలలుగా పడకేశాయి. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం పోలవరం పనులు ఒక అంగుళం కూడా ముందుకు జరగలేదు. అసలు జగన్ ప్రభుత్వంపోలవరం పనులు చేపడుతుందా…లేక కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తుందా… అనే ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా రాష్ట్ర బిజెపి వర్గాలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకుంటున్న చొరవ. ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది.
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ, మరోపక్క బిజెపి నేతల ద్వారా సమాచారం రాబట్టు కుంటుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ పోలవరం లో అవకతవకలు జరిగాయని రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం…దానికితోడు వర్షాకాలం కావడం ప్రాజెక్ట్ పనులన్నీ ఆపేస్తున్నామని, తిరిగి నవంబర్ నెలలో పనులు చేపడతామని జగన్ ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు కానీ సీన్ చూస్తే. … ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి. ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపిస్తోంది.
గత కొంత కాలంగా బీజేపీ నేతలు పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్లతో సమావేశమయ్యారు ప్రాజెక్టు స్థితిగతులు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం లో జరుగుతున్న ఎపిసోడ్ అంతా కేంద్రానికి తెలిపారు.
ఈ నెలలో మళ్లీ బీజేపీ బృందం పోలవరం యాత్ర చేపట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో పాటు పలువురు బీజేపీ నేతలు పోలవరం సందర్శించి అస్తవ్యస్తంగా పోలవరం పనులు ఉన్నాయంటూ ప్రాజెక్టు నిర్మాణం మరియు వ్యయం, రివర్స్ టెండరింగ్ సహా అనేక అంశాల్ని కేంద్రానికి నివేదిక తయారు చేసి పంపారు. ఈ నివేదిక కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర శిఖవాత్ అందజేశారు. ఈ నివేదికలు వైయస్సార్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి కూడా ఉంది అంటూ బిజెపి నేతలు తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ తాజా పరిస్థితిపై కేంద్రం ఈ నెల 20వ తేదీ పోలవరం అధారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.. జగన్ సర్కార్ పోలవరం విషయం పై వెనక్కి వేస్తుంటే బిజెపి సర్కార్ పోలవరాన్ని దగ్గర తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నడు లేని విధంగా కమల నాథులు పోలవరం యాత్రలు చేపట్టడం ఎనకాల మర్మం ఏమిటి అనే విషయం జగన్ సర్కార్ మింగుడు పడటం లేదు. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ లో మెఘా కంపెనీ అవకాశాలు కల్పించడం, నవయుగ కోర్టును ఆశ్రయించడం ఇలా పలు అనుమానాలకు దారితీస్తుంది..
తెలుగు రాష్ట్రాల్లో మెఘా కంపెనీ ప్రాజెక్టు దక్కించుకోవడమే ధ్యేయంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కనుసైగలతో నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెఘా కంపెనిని తక్కువ వ్యయంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందుకు రావడం ఆంతర్యం ఏమిటి అని ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు దక్కించుకున్న మెఘా ప్రస్తుతం పోలవరంపై కన్నువేసి ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద అవినీతి కి దారి తీస్తుంది అంటూ ప్రతిపక్ష నేతలు తెలుపుతున్నారు..