హైదరాబాద్: బీజేపీ సెంటర్లో పవర్ ఫుల్ గా అధికారంలో ఉన్నప్పటికీ మీడియా రిలేషన్స్ విషయంలో ఏ మాత్రం మొహమాటం, భేషజాలు పాటించడం లేదు. తెలంగాణాలో ఎలాగైనా పాగా వేయాలనే ప్లాన్ లో ఉన్న బీజేపీ అవసరమైన అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. రాజకీయాల్లో మీడియా సహకారం ఎంతో ముఖ్యం. అందుకే ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను కలిశారు. మాటముచ్చట కలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు కారణాలను వివరించడం అజెండా అయినా అసలు మర్మం మీడియా దోస్తీ మాత్రమే.
దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులను కేంద్రమంత్రులు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా వేమూరి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కేంద్ర మంత్రితోపాటు రాధాకృష్ణను కలిసి మీడియా సహకారం కోరడం జరిగింది.