యోగీ సారుకు 'పరాభవం'!

ఉత్తరప్రదేశ్ రూలింగ్ పార్టీకి రంగు పడింది. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గోరఖ్‌పూర్‌ లోక్‌సభ సీటు ‘పోయింది’! ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ సమీప బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్‌ శుక్లాపై అనూహ్య విజయం సాధించారు. గతంలో గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాధ్ ఐదుసార్లు గెలిచారు. 2014లో ఇదే లోక్‌స‌భ స్థానం నుంచి యోగి.. ఏకంగా 3 ల‌క్ష‌ల 12 వేల‌కుపైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గత ఏడాది యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈసారి కూడా తమ గెలుపు నల్లేరు మీద నడకగానే భావించింది ఆ పార్టీ. అటు.. డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య గతంలో ప్రాతినిధ్యం వహించిన ఫూల్‌పూర్‌ నియోజకవర్గం సైతం బీజేపీ చేజారిపోయింది.