గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల మధ్య దోస్తానా మరోసారి బట్టబయలైందన్నారు. చీకట్లో దోస్తానా చేస్తూ బయట వేర్వేరుగా ఉన్నాయన్న తమ వ్యాఖ్యలు మరోసారి బయటపడిందన్నారు.
నిజానికి టీఆర్ఎస్, ఎంఐఎం అవగాహనతో కలిసి పోటీచేయకపోతే టీఆర్ఎస్ కు సింగిల్ డిజిట్ కార్పోరేటర్లు మాత్రమే వచ్చేవన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని రుజువైందని బండి సంజయ్ అన్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని స్పష్టం జోస్యం చెప్పారు. సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కార్పోరేటర్లు వాచ్ డాగ్ లా పనిచేస్తారని… ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామన్నారు.