బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చినప్పటి నుండి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ ను పూర్తిస్థాయిలో టార్గెట్ చేయగా… బీజేపీ పేరు ఎత్తకుండానే కేసీఆర్ నగర ప్రజలను తన ఎన్నికల ప్రసంగంలో హెచ్చరించారు. శాంతిభద్రతలు ఉండవని, రియల్ ఎస్టేట్ పడిపోతుందని ఇలా రకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చారు.
ఇక మూసీని గోదావరి నీటితో అనుసంధానిచ్చి, ప్రక్షాళన చేస్తామన్నారు. దీనిపై బండి సంజయ్ స్పందించారు. ప్రక్షాళన చేయాల్సింది ముందు కేసీఆర్ నోటిని ఆ తర్వాతే మూసీని అంటూ మండిపడ్డారు. వరదల సమయంలో ప్రేక్షకపాత్ర వహించి, ఇప్పుడు తామంత ఏదో చేశామన్నట్లుగా భ్రమలు కలిగిస్తున్నారన్నారు.
ఈ దేశానికి బీజేపీయే శ్రీరామ రక్ష అని, బీజేపీ గెలుపును అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.