ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ ప్రత్యక్ష పోరాటాన్ని మొదలుపెట్టింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ ఆందోళనలు, ధర్నాలు చేసింది. బస్ భవన్ వద్ద ధర్నాకు దిగిన బీజేపీ అద్యక్షుడు లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. లక్ష్మణ్ ఆర్యోగ్య స్థితి, ఆర్టీసీ సమ్మెపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డా లక్ష్మణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.