తెలంగాణలో బీజేపీతో 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ వైపు చూస్తున్నారని ఆయన ప్రకటించారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ పలువురు కౌన్సిలర్లు తమ వైపు చూస్తున్నారని… కానీ తాము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నామన్నారు.
గ్రేటర్ లో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణం చేయించటం లేదని, కావాలనే కుట్రపూరితంగా అధికార పార్టీ ఎన్నికల సంఘంతో వాయిదా వేస్తుందని బీజేపీ బృందం గవర్నర్ తో బేటీ అయ్యింది.