కరీంనగర్ లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా జరిగిన గొడవ చినుకు చినుకు కలిసి గాలి వానలా మారింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పైన పోలీసులు చెయ్యి చేసుకుని దురుసుగా ప్రవర్తించారంటూ జమ్మికుంట పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శవయాత్ర చేస్తూ దిష్టి బొమ్మని దహనం చేశారు. మాజీ మంత్రి బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. సమాచారమే అందుకున్న పోలీస్ లు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అప్పటికే దిష్టిబొమ్మ కి నిప్పు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కు , పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.