బీజేపీని బీజేపీ సమావేశానికి పిలవకపోవటంపై ఎమ్మెల్యే రఘనందన్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వటమేనన్నారు. ఐదుగురు సభ్యులుంటేనే బీఏసీ సమావేశానికి పిలువాలని ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
తమను బీఏసీకి అనుమతించకపోవటంపై అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీ విలీనం అయినట్లు స్పీకర్ ఇప్పటికే గెజిట్ విడుదల చేశారని, అలాంటప్పుడు కాంగ్రెస్ తరఫున మళ్లీ బీఏసీకి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీని బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవరని భట్టి ఎందుకు ప్రశ్నించరని ఆయన ప్రశ్నించారు