తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగర్ మేయర్ ఎవర్నది ఉత్కంఠ రేపుతోంది. గ్రేటర్ ఫలితాల్లో హాంగ్ రావటంతో… మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిరేపుతుండగా, కీలక పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి.
టీఆర్ఎస్ తమ మేయర్ అభ్యర్థిని సీల్డ్ కవర్ లో కార్పోరేటర్లకు చెబుతుందని… మన అభ్యర్థే మేయర్ అని చెప్పేశారు. కానీ టీఆర్ఎస్ కు 56 మంది కార్పోరేటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో తమ ఎక్స్ అఫిషియో ఓట్లు కలుపుతున్నా… గట్టేక్కేలా లేదు. టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తప్పనిసరి కానుంది.
టీఆర్ఎస్ కు అంత హిజీగా మేయర్ పదవి అప్పజెప్పవద్దన్న ఆలోచనతో ఉన్న బీజేపీ… తమ కార్పోరేటర్లతో వరుసగా భేటీ అవుతుంది. బీజేపీకి 47మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. బీజేపీ కూడా మేయర్ పోటీలో ఉంటున్నట్లు చెప్పి… టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేసింది.
ఇక నిర్ణయాత్మకంగా మారిన ఎంఐఎం ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది. ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండాలా…? టీఆర్ఎస్ కు మద్దతివ్వాలా…? అన్న అంశంపై తర్జనభర్జన పడుతుంది. గురువారం మేయర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కార్పోరేటర్లతో సమావేశం కానున్నారు.