తీహార్ జైలులో వున్న సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియోను బీజేపీ విడుదల చేసింది. తాజా వీడియోలో సెల్ లోపల ఢిల్లీ మంత్రిని జైలు అధికారి కలిసినట్టు కనిపిస్తోంది. జైలులో ఉన్నఆప్ నేతను రాత్రి 8 గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్ పరామర్శించారంటూ ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు సబంధించిన వీడియోను బీజేపీ విడుదల చేసింది.
ఇటీవల విడుదలైన మంత్రి వీడియోలు ఆప్ ను ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీ తీహార్ జైల్లో సత్యేందర్ జైన్ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. జైలులో ఆయన మసాజ్ చేయించుకుంటున్న వీడియో, ఫ్రూట్ సలాడ్ తింటున్న వీడియోలు విడుదల కావడం చర్చనీయాంశమైంది.
తాజాగా ప్రస్తుతం జైలు అధికారులతోనే మంత్రి సత్యేందర్ జైన్ పిచ్చాపాటీ కాలక్షేపం చేస్తున్నట్టు ఉన్న వీడియో లీక్ అయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ మరింతగా ఇరకాటంలో పడింది. తాజాగా విడుదలైన వీడియోలో సత్యేందర్ జైన్, జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు జైలు అధికారి అజిత్ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యారు.
తీహార్‌లో మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియోను మీడియా బయటపెట్టిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ ట్వీట్ చేశారు. ఈసారి సత్యేందర్ కా దర్బార్‌లో జైలు సూపరింటెండెంట్‌ని సస్పెండ్ చేశారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.