నోటి కాడి ముద్దను బీజేపీ లాక్కోవడంపై శివసేన ఆ పార్టీపై ఆగ్రహంతో ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ లో 56 స్థానాలు ఉన్న శివసేన చూస్తూ ఊరుకుంటుందా. కచ్చితంగా అలాంటి పరిస్థితి ఉండదనే చెప్పాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి శివసేన ను ఎదుర్కోవడం అంతా ఈజీ కాదు.
శివసేన ప్రాంతీయ పార్టీ కావడంతో స్థానిక సమస్యలు, లోకల్ సెంటిమెంట్ తో శివసేన చేసే రాజకీయాలను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి వచ్చేసిందని సంబరాలు చేసుకున్న శివసేన కు రాత్రి కి రాత్రి జరిగిన పరిణామం మింగుడు పడడం లేదు.