• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ఆదిపురుష్ పై మ‌రిన్ని విమ‌ర్శ‌లు!!

ఆదిపురుష్ పై మ‌రిన్ని విమ‌ర్శ‌లు!!

Last Updated: October 4, 2022 at 10:31 am

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తున్న చిత్రం ఆదిపురుష్‌. రెండు రోజుల క్రిత‌మే ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. అప్ప‌టి నుంచి కూడా చిత్ర యూనిట్ అనేక విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంది. రాముడ్ని, రావ‌ణుడిని ద‌ర్శ‌కుడు చూపించిన తీరు ఏమాత్రం స‌రిగా లేదంటూ పేర్కొంటూ నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా ఈ చిత్రంలో రావ‌ణ‌సురిడ్ని చూపించిన తీరు పై బీజేపీ అధికార ప్ర‌తినిధి మాళ‌విక అవినాశ్ తీవ్రంగా మండిప‌డ్డారు. “ఈ విషయంలో చాలా బాధగా ఉంది. బహుశా డైరెక్టర్​ ఓం రౌత్​.. వాల్మీకి రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అధ్యయనం చేయలేదనుకుంటాను. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది.” అంటూ మళవిక సీరియస్​ అయ్యారు.

‘భూకైలాస్‌’లో సీనియర్ ఎన్టీఆర్​ లేదా సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు చేసిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్​లో రావణుడు నీలి కళ్లతో లెదర్​ జాకెట్​ వేసుకున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలో రావణుడి పాత్రను వక్రీకరించనందుకు చాలా బాధగా ఉంది.

“లంకకు చెందిన ఒక శివ-భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు! వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు! అయితే ఆదిపురుష్​లోని రావణుడు.. టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు! మన రామాయణం/చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి! లెజెండ్ ఎన్​టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా?” అంటూ ట్వీట్​ చేశారు.

అయితే ఆదిపురుష్ టీజర్ యానిమేటెడ్‌లా ఉందని, వీఎఫ్ఎక్స్ బాగోలేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇది నార్మల్ సినిమానా లేక బొమ్మల సినిమానా అని చాలామంది సందేహ పడుతున్నారు.

రావణుడిని చూపించిన తీరుతో పాటు నెటిజన్లు పుష్పక విమానాన్ని చూపించిన తీరుపైనా మండిపడ్డారు. ఎంతో అందంగా ఉండే పుష్పక విమానాన్ని ఒక భయంకరమైన జీవి స్వారీ చేస్తున్నట్లు ఉందని సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

టీ సిరీస్​-రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘ఆదిపురుష్‌’ వచ్చే ఏడాది సంకాంత్రి కానుకగా జనవరి 21న రిలీజ్​ చేయనున్నారు మేకర్లు. ఈ సినిమా మొత్తం బడ్జెట్‌ విలువ రూ.400 కోట్లు అని సమాచారం. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Ravana,a Shiva-Bhakta Brahmin from Lanka had mastered the 64 arts!Jaya(Vijay) who was guarding Vaikunta descended as Ravana owing to a curse!
This may be a Turkish tyrant but is not Ravana!
Bollywood,Stop misrepresenting our Ramayana/History!Ever heard of the legend NTRamaRao? pic.twitter.com/tGaRrsSQJW

— Malavika Avinash (@MalavikaBJP) October 3, 2022

Primary Sidebar

తాజా వార్తలు

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

ఇక నుంచి వ్యాపారం చేయాలంటే..ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్‌ తప్పనిసరి!

రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల తవ్వకాలు!

త్వరలోనే టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలు..పరీక్షలు ఎప్పుడంటే!

మక్కా వెళ్తుండగా ప్రమాదం..20 మంది మృతి!

అమెరికా పాఠశాలలో కాల్పులు..ఆరుగురి మృతి!

రాహుల్ పై..! ఉసేన్ బోల్ట్ ఆశ్చర్యపోయేలా..!?

‘డార్లింగ్’ అంటే తప్పా? కాంగ్రెస్ నేత సమర్ధన

కిడ్నీ వ్యాధితో మృతి చెందిన చిరుత..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

ఫిల్మ్ నగర్

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా...!?

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు...చెప్పండి !?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు…చెప్పండి !?

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ ...!

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

ఫ్లైట్ లో విష్ణుతో కలిసి మోహన్ బాబు.. మరి మనోజ్ ఎక్కడ?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap