బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వార్ నడుస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోను షేర్ చేసి బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ సైతం బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.
ఇటు కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో బదులిస్తోంది. నేపాల్ కు చెందిన ఓ జర్నలిస్టు వివాహానికి రాహుల్ గాంధీ వెళ్లారని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు. కుటుంబ కార్యక్రమాలకు హాజరుకావడం తప్పుకాదన్నారు.
2015లో నవాజ్ షరీఫ్ ను కలిసేందుకు మీ నాయకుడు పాక్ కు వెళ్లలేదా? అని ప్రశ్నిస్తున్నారు. మీ నేతలు ఏం తక్కువ కాదంటూ బీజేపీపై మరికొందరు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రతిగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మద్యం బాటిళ్లతో ఉన్న ఫోటోలను కాంగ్రెస్ నేతలు షేర్ చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేతపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.