
ప్రధాని మోడీ ఆయన ప్రభుత్వం ఎంతో సాహసోపేతంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలను తీసుకువచ్చింది. నిజానికి డెబ్భై ఏళ్ల క్రితం చేయాల్సిన సంస్కరణలను మోడీ ప్రభుత్వం ఇప్పుడు చేసింది.మోడీ ప్రభుత్వం ఇటువంటి సంస్కరణలు చేసి దేశ గతిని మార్చడానికే ప్రజల మద్దతుతో పూర్తిస్థాయి మెజార్టీ తో అధికారంలోకి వచ్చింది. వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చడానికి రైతులకు సాధికారత చేకూర్చడానికి అలాగే చిన్న సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. మొదట్లో కొన్ని రైతు సంఘాలు ఆందోళనలు చేసినప్పుడు మోడీ ప్రభుత్వమే బాధ్యతగాఎంతో సున్నితత్వంతో నాలుగు అడుగులు ముందుకేసి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ చాలా వరకు రైతులు చెప్తున్నవన్నీ కూడా సమాచార లోపం తో కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనం కోసం సృష్టిస్తున్న అపోహలు మాత్రమే.
మా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనిమిది అంశాలపై సవరణ చేయడానికి అంగీకరించింది. కానీ రైతు సంఘాలు వారి లక్ష్యాలను మార్చుకుంటూ వారి వెనుక ఉన్న రాజకీయ శక్తుల అవసరాల కోసం హేతుబద్ధత లేని వాదనను చేస్తున్నాయి.ప్రభుత్వం ఎంతో నిజాయితీగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పటికీ రైతు సంఘాలు ఆందోళనలు కొనసాగించడం వెనుక ఉద్దేశ్యాలు ఏంటో అర్థం కావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళన కాంగ్రెస్,కమ్యూనిస్టు,ఇతర ప్రాంతీయ పార్టీల ప్రోద్బలంతో వారి మద్దతుతో జరుగుతున్న ఆందోళనగా బీజేపీ నమ్ముతుంది. రోజు రోజు కీ దేశ వ్యాప్తంగా బీజేపీ బలపడ్తున్న నేపథ్యంలో ఈ పార్టీలు బ్రతకడమే కష్టమై పోయింది.ఓ వైపు దేశ ప్రజలు వారిని తిరస్కరిస్తుండటం తో వేరే గత్యంతరం లేక వాళ్లు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ తిరోగమన పార్టీలు మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఎజెండాను ఆపలేవని బీజేపీ విశ్వసిస్తుంది. ఇలాంటి రైతు వ్యతిరేక పార్టీలను భారత ప్రజలు తిరస్కరిస్తారు.