ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని చూసి తెలంగాణ సీఎంకు ఎన్నికల ఫీవర్ పట్టుకుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌తరుణ్ చుగ్. అందుకే మతి స్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వంద స్థానాల్లో ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా వెంటిలేటర్ మీద ఉందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ కి కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ గా పనిచేస్తోందని ఆరోపించారు.
బీజేపీలో నేతలు, కార్యకర్తులెవరూ అసంతృప్తితో లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ధాన్యం సేకరణపై కేసీఆర్ పాలసీ ఏంటని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కరోనా టైమ్ లో కేసీఆర్ ప్రజలకు చేసిందేంటని నిలదీశారు తరుణ్ చుగ్.
రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో సర్వేలు జరుగుతున్నాయని.. టీఆర్ఎస్ 95 నుంచి 105 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యాఖ్యలకు తరుణ్ చుగ్ కౌంటర్ ఇచ్చారు.