రాష్ట్రానికి అందిన కేంద్ర నిధులపై శాఖల వారీగా చర్చకు సిద్ధమేనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. దక్షిణాదిని కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఢిల్లీలో కాళ్లు.. హైదరాబాద్‌లో కన్నీళ్లు అన్నట్టు సీఎం కేసీఆర్, కేటీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవాచేశారు. కేంద్రంపై సోషల్ మీడియా ట్విట్టర్ లో కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. విభజన రాజకీయాలు చేయటం తండ్రీకొడుకులకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. రక్షణశాఖ భూములను కొట్టేయాలని టీఆర్ఎస్ భావించిందని…. భూములివ్వటం కుదరదన్నందుకే కేంద్రంపై ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఎదిగిన టీఆర్ఎస్.. నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పుగా తయారైందని లక్ష్మణ్ విమర్శించారు.