కేసీఆర్ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ పాలనపై బీజేపి డేగ కన్నుతో ఉందని, కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే… ప్రభుత్వం కూలటం ఖాయమంటున్నారు బీజేపి నేత లక్ష్మణ్. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, ప్రజలు తిరగబడతే… ఎంత మంది ఎమ్మెల్యేలున్నా కేసీఆర్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని ఆరోపించారు బీజేపి అద్యక్షుడు లక్ష్మణ్. మిమ్మల్ని వదలిపెట్టమని, మీ కుటుంబపాలన, అవినీతిని వదిలిపెట్టే సమస్యేలేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో చెలగాటం ఆడుతున్నారని… ఈ సమ్మెతో కార్మికుల ఆగ్రహజ్వాలలు మిమ్మల్ని దహించి వేస్తాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పదవులు పట్టుకొని పాకులాడుతారా… లేక ప్రజలతో ఉంటారా తేల్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సలహ ఇచ్చారు. నేను కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నానని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా నాతో మాట్లాడారు.. డేగ కన్నుతో బీజేపి అధినాయకత్వం తెలంగాణపై చూస్తోందని… ప్రభుత్వం దిగిరాకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.