గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ నుండి గెలిచిన కొత్త కార్పోరేటర్లకు టీఆర్ఎస్ వల విసురుతోందా…? మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తుందని బీజేపీ అనుమానిస్తుందా…? అంటే బీజేపీ అడుగులు నిజమేనన్న ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి.
గ్రేటర్ లో బీజేపీ తరుపున గెలిచిన కార్పోరేటర్లతో చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో పూజల అనంతరం బీజేపీ నాయకత్వం చేయించిన ప్రతిజ్ఞ, తాజాగా ఎన్నికల గెలుపుపై గెజిట్ ఆలస్యం చేస్తున్నందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై బీజేపీ నేతల ఆరోపణలు చూస్తుంటే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తుందన్న అనుమానం వ్యక్తం అవుతుంది. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తమ కార్పోరేటర్ల జోలికి వస్తే… మేం మీ ఎమ్మెల్యేల జోలికి రావాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించటం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతుంది.
అయితే, మేయర్ ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుటికప్పుడు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మేయర్ ఎన్నిక సమయంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ మార్చుకునే అవకాశం ఉంటుందంటున్నారు.