బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ
కరోనా నివారణకు చేపట్టిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరినీ బీజేపీ కార్యకర్తలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా కు చెందిన కార్మికులు లాక్ డౌన్ కారణంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద నివసిస్తున్న సంఘటన చూసి చెలించిపోయిన బండి సంజయ్, వారికి 20 రోజులకు సరిపడా 11 రకాల నిత్యావసర సరుకులు అందించారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను వారికి వివరిస్తూ, ఎలాంటి సహాయం కావాలన్న చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రభుత్వ పరంగా కూడా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తానని, లాక్ డౌన్ ముగిసే వరకు ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధం అని తెలిపారు.
దేశంలో కరోనా వైరస్ నివారణకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు పాటించాలని,ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సైనికుని వలే పోరాడాలని,దాని కోసం ఎవ్వరు ఇంటి నుండి బయటకు రాకూడదని అన్నారు.ప్రభుత్వం కల్పించిన అత్యవసర సరుకుల సేకరణ నిమిత్తం బయటకు వచ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, ఇంటికి వెళ్ళాక చేతులు శుభ్రంగా కడుక్కోవలని, కరచాలనం మాని నమస్కారం పెట్టాలని, సామాజిక దూరం పాటించాలని తెలిపారు..
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నదని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు 130 కోట్ల మంది భారతీయుల శ్రేయస్సు, సంక్షేమం కోసమేనని అన్నారు. ప్రతి ఒక్కరు తమను తాము రక్షించుకుంటూనే దేశాన్ని రక్షించడానికి లాక్ డౌన్ ను పాటించాలని అన్నారు. కర్ఫ్యూ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆగిపోయిన ఇతర రాష్ట్రాల వారిని మరియు పేదలను బీజేపీ కార్యకర్తలు గుర్తించి వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతీ రోజు ఐదు మంది పేదలకు భోజనం అందించాలని సూచించారు. అటు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే పేద వారికి సేవ చేయాలని బండి సంజయ్ కోరారు.
అలాగే, రెండు రోజులుగా స్వయంగా కరీంనగర్ లో పేద బస్తీల్లో ఉన్నవారికి భోజనం అందించే కార్యక్రమం చేపడుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ రోజు కూడా మధ్యాహ్నం ఐదుగురికి భోజనం అందించారు. తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం అని, ఇక్కడ చిక్కుకున్న మిగతా రాష్ట్రల ప్రజలకు సేవ చేయాలని, అందులో భాగంగానే స్వయంగా సేవ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొంటున్నారు.బీజేపీ కార్యకర్తలు కూడా ఈ లాక్ డౌన్ ముగిసే వరకు సేవ భావంతో ప్రతి ఒక్కరు ముందుండాలని పిలుపునిచ్చారు.