హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 90వ అభ్యర్థిని ఎలిమినేట్ చేశారు. దీంతో పోటీలో చివరకు టీఆర్ఎస్ నుండి వాణీదేవీ, బీజేపీ నుండి రాంచంద్రరావు, స్వంతంత్ర అభ్యర్థిగా ప్రొ.నాగేశ్వర్ ఉన్నారు.
90వ అభ్యర్థి ఎలిమినేషన్ లో భాగంగా… బీజేపీకి 14,530ఓట్లు, టీఆరెఎస్ కు 15,321, నాగేశ్వర్ కు 13,773ఓట్లు జమయ్యాయి. దీంతో బీజేపీకి 1,19,198ఓట్లు వచ్చినట్లయింది. టీఆరెఎస్ కు 1,28,010, నాగేశ్వర్ 67,383ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుతం 8,812ఓట్ల లీడ్ లోఉన్నారు. ఇక ప్రొ.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవ్వనుంది.
అయితే, సెకండ్ ప్రియారిటీలో నాగేశ్వర్ భారీగా ఓట్లు చీల్చటం బీజేపీకి టెన్షన్ పట్టుకుంది. పైగా నాగేశ్వర్ సెకండ్ ప్రియారిటీ ఓట్లపైనే బీజేపీ భవితవ్యం ఆధారపడింది.