-త్రిపురలో హంగ్
– కింగ్ మేకర్ గా తిప్రా మోతా పార్టీ
-నాగాలాండ్‌లో బీజేపీదే విజయం
– మేఘాలయాలో విజేతను నిర్ణయించనున్న పొత్తులు
ఈశాన్య భారతంలోని మూడు రాష్టాల్లో ఇటీవల పోలింగ్ జరిగింది. ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో హంగ్ ఏర్పడుతుందని, ఒక రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్ర పక్షం కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని చెప్పింది.
త్రిపురలో అధికార బీజేపీకి 18 నుంచి 26 సీట్లు వస్తాయని పీపుల్ప్ పల్స్ పేర్కొంది. సీపీఐ(ఎం) ఇతర లెఫ్ట్ పార్టీలు 14 నుంచి 22 స్థానాల్లో విజయ సాధిస్తాయని పేర్కొంది. , కాంగ్రెస్‌కు 1 నుంచి 3 సీట్లు, ఐపీఎఫ్టీకి ఒక సీటు ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటకు 31 సీట్లు కావాల్సి వుంటుంది. ఈ క్రమంలో ఇక్కడ తిప్రా మోతా పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందన్నారు. ఆ పార్టీకి 11 నుంచి 16 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఆ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం….
మేఘాలయలో అధికార ఎన్పీపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్పీపీకి 17 నుంచి 26 సీట్లు వస్తాయి. టీఎంసీకి 10 నుంచి 14, యూడీపీకి 8 నుంచి 12, బీజేపీకి 3 నుంచి 8, కాంగ్రెస్ కి 3 నుంచి 5, ఇతరులు 4 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు పొందాల్సి వుంటుంది. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉండటంతో ఫలితాల అనంతరం ఏర్పడే పొత్తులు ప్రభుత్వాన్ని నిర్ణయించనున్నాయి. ఇక నాగాలాండ్ లో మాత్రం అధికార ఎన్డీపీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలో ఎన్డీపీపీకి 20 నుంచి 27, బీజేపీ కి 14 నుంచి 21, ఎల్ జేపీకి 5 నుంచి 10 సీట్లు, ఎన్పీఎఫ్ కి 3 నుంచి 8, కాంగ్రెస్‌కు 2 నుంచి 4, ఇతరులకు 2 నుంచి 4 సీట్లు వస్తాయి. రాష్ట్రంలో అధికారం చేజిక్కిచ్చుకోవాలంటే పార్టీ 31 సీట్లు సాధించాల్సి వుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్డీపీపీ, బీజేపీ కలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.