అమిత్ షా తరహాలోనే సభ్యత్వ నమోదులో నడ్డా!
తెలంగాణలో తరచూ టూర్లు
హైదరాబాద్ : ఇకపై తెలంగాణలో బీజేపీ బలోపేతం, పార్టీ సభ్యత్వ నమోదును స్వయంగా పర్యవేక్షించనున్న నడ్డా.. వీలైనన్ని ఎక్కువ పర్యటనలు తెలంగాణలో చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పార్టీ కోర్ కమిటీ సమావేశంలో దిశానిర్దేశం చేసిన నడ్డా.. గ్రామగ్రామాన బీజేపీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
గత పర్యటనలో అమిత్ షా తరహాలోనే నడ్డాకూడా తెలంగాణలోని బాగ్ లింగంపల్లిలోని కాలనీల్లో ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదుచేయడం కూడా తెలంగాణపై బీజేపీ ఫోకస్ ఏ స్థాయిలో ఉందనేది చాటుతోంది. మొత్తం మీద రాజకీయంగానూ, పరిపాలన పరంగానూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నారు.