హుజురాబాద్ లో ఓవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో వీణవంక మండలంలో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కోర్కల్ లో టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనితో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బిజెపి టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి ఘర్షణ పడ్డ రెండు వర్గాల పై కూడా కేసు నమోదు చేశారు.
అలాగే మరోవైపు వీణవంక మండలం గనుముక్కుల లో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్, బిజెపి నేతలు మధ్య ఈ గొడవ చోటుచేసుకుంది. కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని బిజెపి కార్యకర్తలు నాయకులు ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి తో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు.