మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ గురువారం విడుదల చేసింది. ప్రధానంగా యువత, రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది. ఇంపాల్ లో నిర్వహించిన బహిరంగ సభలో మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు.
‘ నేను రిపోర్టు కార్డుతో ఇక్కడకు వచ్చాను. ఇది బీజేపీ కల్చర్ ను, సుపరిపాలనను తెలుపుతుంది. గత ఐదేండ్లలో సీఎం బీరెన్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిగా గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో అస్థిరత స్థానంలో స్థిరత్వం వచ్చి చేరింది” అన్నారు.
‘ మేము అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద మహిళలకు రెండు ఉచిత సిలిండర్లను ఇస్తాము. ఇది మహిళలకు, పేదలకు సాధికారతను అందిస్తుంది. రాష్ట్రంలో కాలేజీలకు వెళ్లే విద్యార్థినుల్లో మెరిట్ కలిగిన వారికి ఉచిత స్కూటీలను ఇవ్వబోతున్నాము” అని తెలిపారు.
‘ యువత, మహిళళ, రైతుల సాధికారతే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని మత్స్యకారులకు రూ. 5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమాను అందజేస్తాము. ఆర్థికంగా వెనకబడిన, బలహీన వర్గాల బాలికలకు వారి చదువు, అభివృద్ధి కోసం రూ. 25,000లను ఇవ్వనున్నట్టు” వెల్లడించారు.