మోడీ సర్కార్ పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అగ్ని పథ్ ద్వారా బీజేపీ తన సొంత సాయుధ కేడర్ ను తయారు చేసుకోవాలని చూస్తోందని ఆమె అన్నారు.
నాలుగేండ్ల తర్వాత అగ్నివీరులు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా యువకులకు ఆయుధాలు ఇవ్వాలని బీజేపీ చూస్తోందని ఆమె మండిపడ్డారు.
తమ పార్టీ కార్యాలయాలకు భద్రతాధికారులుగా అగ్నివీరులను నియమిస్తామన్న బీజేపీ నేత ఖైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నాలుగేండ్ల పదవీ కాలం ముగిశాక అగ్నివీరులను వాచ్ మెన్లుగా నియమించాలని బీజేపీ భావిస్తోందా? ఆమె ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా సాయుధ బలగాలను కేంద్రం అవమానించిందన్నారు.