• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Opinion » కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతే లేదు- విజయశాంతి

కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతే లేదు- విజయశాంతి

Last Updated: March 3, 2022 at 8:27 am

విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత

మహిళల్ని అవమానించి పైశాచిక ఆనందం పొందుతున్న కేసీఆర్.. ఈసారి తన శాడిస్ట్ మనస్తత్వానికి ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది తీవ్ర అభ్యంతరకరం. ఇది ఇప్పటి బడ్జెట్ సమావేశాల అంశం మాత్రమే కాదు. గత నెలలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవం రోజున కూడా కేసీఆర్, రాష్ట్ర మంత్రులు రాజ్‌ భవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా గవర్నర్ ని అవమానించారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆడబిడ్డ దేవతల జాతరలో కూడా మహిళా గవర్నర్ ని ప్రోటోకాల్ ఉల్లంఘనతో అవమానించారు. స్వాగతం పలికేందుకు… వీడ్కోలు చెప్పేందుకు ములుగు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ రాలేదు. మేడారంలో గవర్నర్‌ ఉన్నంత సేపు మంత్రులు, అధికారులు కనిపించలేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంత అభివృద్దిపై గవర్నర్‌ కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అయినా కలెక్టర్‌ గానీ, ఎస్పీ గానీ పట్టించుకోలేదు.

గవర్నర్ పర్యటన రోజున.. ఆ ఉదయం వరకూ మంత్రులు అక్కడే ఉన్నరు. కానీ, తమిళిసై వచ్చే సమయానికే ఎలా మాయమయ్యారు? వీరంతా గవర్నర్ పట్ల ఇలా ప్రవర్తించేలా ఎవరు పురిగొల్పారో అందరికీ తెలుసు. ఈ చర్యలన్నీ యావత్ మహిళా లోకాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదు. తమిళ ఆడపడుచు అయిన గవర్నర్ ని ఘోరంగా అవమానిస్తున్న కేసీఆర్… ఏ ముఖంతో తమిళనాడు సీఎంతో ఫ్రంట్ పేరు చెప్పి మీటింగులు చేస్తున్నారు? తమిళ ప్రజలేమీ అమాయకులు కారు.

మహిళల పట్ల తొలి నుంచీ కేసీఆర్ వివక్షతోనే వ్యవహరిస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కేబినెట్‌ లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు కేబినెట్‌ ను విస్తరించలేదు. పలు విమర్శల నేపథ్యంలో మాత్రమే ఆ విస్తరణలో పేరుకు ఇద్దరు మహిళలకి మంత్రి పదవులిచ్చారు. గతేడాది ఫిబ్రవరి నెలలో జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను కుక్కలు అని దూషించిన కేసీఆర్ వ్యాఖ్యలను మహిళాలోకం మర్చిపోలేదు. మహిళలపై ఇలా వ్యవహరించే కేసీఆర్… చట్ట సభల నిర్వహణలో రూల్స్ పాటిస్తారనుకోవడం పొరపాటే.

గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే అసెంబ్లీ సెషన్ ప్రారంభిస్తున్నారు. పైగా అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఈ సెషన్‌ ను ఇంతకుముందు జరిగిన దానికి కొనసాగింపుగానే పరిగణిస్తామనడం మూర్ఖత్వం కాదా? ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతే బడ్జెట్ సెషన్ ప్రారంభం కావాలి. కానీ.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోంది. కేసీఆర్ రూల్స్ ఏవీ పాటించడం లేదు. నేనే ఒక రాజు, తెలంగాణ ఒక రాజ్యం అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న గవర్నర్‌ నే గుర్తించనని కేసీఆర్‌ కు సీఎం సీటులో ఒక్క నిమిషం కూడా కూర్చునే అర్హత లేదు. ప్రజలు ఆయన చేష్టలన్నీ గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెప్తారు.

Primary Sidebar

తాజా వార్తలు

పురిటి నొప్పులకు మామూలు నొప్పులకు తేడా ఏంటీ…?

చీము పడితే అన్నం అసలు తినవద్దు…!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నాడో తెలుసా..?

కాంగ్రెస్ పాదయాత్ర..రేవంత్ లేకుండానే!

అనుమ‌తిని ఇచ్చేదే లే!!

వారిని ఉత్స‌వ విగ్ర‌హాలు చేసిన కేసీఆర్‌

కేసీఆర్ హ‌యాంలో రాష్ట్రం వెన‌క‌బ‌డింది

ఆయ‌న సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు: కేటీఆర్‌

ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు: శ్రీ‌నివాస్ గౌడ్‌

రే చీకటి అంటే ఏంటీ…? రాకుండా ఉండాలంటే ఏం తినాలి…?

తల పాగా ఉండే సిక్కులకు హెల్మెట్ అవసరం లేదా…?

అద్భుత‌మైన కార్య‌క్ర‌మం!!

ఫిల్మ్ నగర్

బీజేపీలోకి సినీ న‌టుడు సంజ‌య్ రాయిచుర‌!!

బీజేపీలోకి సినీ న‌టుడు సంజ‌య్ రాయిచుర‌!!

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

రెండో రోజే 1300 షోలు క్యాన్సిల్‌!!

రెండో రోజే 1300 షోలు క్యాన్సిల్‌!!

అల్లు అర్జున్ స్టెప్ వెనుక రహస్యం చెప్పిన అమితాబ్

అల్లు అర్జున్ స్టెప్ వెనుక రహస్యం చెప్పిన అమితాబ్

హతవిధీ.. మరోసారి చిరంజీవిపై ట్రోలింగ్

హతవిధీ.. మరోసారి చిరంజీవిపై ట్రోలింగ్

బాబోయ్ బాలీవుడ్.. హిందీ చిత్రసీమకు ఏమైంది?

బాబోయ్ బాలీవుడ్.. హిందీ చిత్రసీమకు ఏమైంది?

బ్లాక్ బస్టర్ బింబిసార.. మొదటి వారం వసూళ్లు ఇవే

బ్లాక్ బస్టర్ బింబిసార.. మొదటి వారం వసూళ్లు ఇవే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)