నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పై పోలీసులు తీరు సరికాదన్నారు బీజేపీ మాజీ శాసనసభపక్ష నేత విష్ణు కుమార్ రాజు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు.తప్పు చేస్తే శిక్ష విధించండి. తాగి చేసినా, మానసిక స్థితి బాగాలేక చేసినా సరే పోలీసుల అలా ప్రవర్తించకూడదన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే అంతా భయపడుతున్నారు. ఈ పరిస్థితి మంచిది కాదని హితవు పలికారు విష్ణుకుమార్ రాజు. ముఖ్యమంత్రికి ఈ పరిస్థితి తెలుసో.. తెలియదో నాకు తెలియదు. కాంట్రాక్టర్లు రాష్ట్రంలో అడుక్కు తింటున్నారు. సీఎంను ఎనిమిది నెలల క్రితం అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఆయన విశాల హృదయంతో అపాయింట్మెంట్ ఇస్తే సమస్యలు చెబుతామని ఎద్దేవా చేశారు.