ఎంతో మంది త్యాగ ఫలం కారణంగా బిజెపి అ ధికారంలోకి వచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. కాకినాడలో బిజెవైఎం రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యాక్రమంలో సోమువీర్రాజు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం బిజెపి ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం అంటే అక్కడ చాలా సంవత్సరాల నుండి మన పని నడుస్తున్న విషయాన్ని మరవకూడదన్నారు. భారత ప్రధానిగా వాజ్పేయ్ 18 పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు .
నేడు రెండవ పర్యాయం భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బిజెపి అధికారంలోకి వచ్చిందంటే మనం చేస్తున్న శ్రమ ఆధారంగా మాత్రమే అందువల్ల మన పార్టీ బలోపేతం కావడానికి శిక్షణా కార్యక్రమాలు క్రమం తప్ప కుండా నిర్వహించుకోవలసిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్, శబరి తదితరులు పాల్గొన్నారు