భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా మధ్యప్రదేశ్ లోని జ్యోతిర్లింగ ఆలయమైన ఉజ్జయిని మహకాళ్ ఆలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత దర్శించుకున్నారు. సాంప్రదాయ పద్దతిలో దోతి, పైన అంగవస్త్రం ధరించి ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జైన సాధువు అయిన ప్రగ్యా సాగర్ ఆశీస్సులను రాహుల్ గాంధీ తీసుకున్నారు. ఆయనతో మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, జైవర్దన్ సింగ్, జితూ పట్వారీలు కూడా ఆలయానికి వచ్చారు. ఈ నెల 25 రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ లోని ఓం కారేశ్వర ఆలయాన్ని రాహుల్ గాంధీ దర్శించుకున్నారు.
సాధువులను పూజించే దేశం మనది అని రాహుల్ గాంధీ అన్నారు. తాను గత మూడు నెలలుగా తపస్సు చేస్తున్నట్టు చెప్పారు. కానీ జీవితంలో చివరి శ్వాస వరకు తపస్సు చేసే రైతులు, కార్మికులు , నిజమైన తపస్విల ముందు ఇది చాలా చిన్నది అని ఆయన అన్నారు.
రైతులకు ఎరువులు అందడం లేదన్నారు. ఒకవేళ వాళ్లకు దొరికినా అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందన్నారు. పూర్తి ప్రీమియం చెల్లించినప్పటికీ వారు తమ ఉత్పత్తులకు తగిన ధర లేదా పంట నష్టానికి బీమా కంపెనీల నుండి పరిహారం అందడం లేదన్నారు.