బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండోరోజు పాదయాత్ర కొనసాగుతోంది. బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగనుంది.
బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి రచ్చ బండ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడనున్నారు. కాగా, భువనగిరి మండలం బస్వాపురం శివారు నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించడానికి ముందు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను స్వాగతించే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ అన్నారు.
పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం, గౌరవం ఇస్తామని చెప్పారు. బీజేపీ లోకి పార్టీ చాలా మంది నాయకులు రావాలనుకుంటున్నారని, పార్టీ లోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని సంజయ్ పేర్కొన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు.
అవినీతి, అక్రమాలతో ప్రజలను పీడిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీపై కొట్లాడుతున్నది బీజేపీయేనని బండి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల , ఏ ఆశయాల ఏర్పడదో వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఆకాంక్షల కోసం బీజేపీ పార్టీ పని చేస్తోందని బండి సంజయ్ తెలిపారు.