తెలంగాణలో కరోనా వైరస్ కు చికిత్సలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలంటూ బీజేవైఎం మెరుపు ధర్నాకు దిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసనలు చేపట్టారు. బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. వైద్యం పేరిట ఏమాత్రం కనికరం చూపకుండా లక్షల్లో బిల్లుల వసూలు చేస్తున్నారని, ఇలాంటి కార్పోరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణలో కరోనా వైద్యాన్ని వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలని, ఆరోగ్యశ్రీ లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలోనూ అనుమతించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పోరేట్ ఆసుపత్రుల నుండి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు.