ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుండడంతో మంత్రులకు నిరసన సెగ తప్పడం లేదు. రోజూ ఎక్కడో ఓచోట నిరుద్యోగులు, ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ నేతల కార్లను అడ్డుకుంటూనే ఉన్నారు. తాజాగా మంత్రులు తలసాని, మహమూద్ అలీ కాన్వాయ్ ని అడ్డగించారు బీజేవైఎం కార్యకర్తలు.
ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. సైదాబాద్ లో మంత్రులను అడ్డుకున్నారు. తలసాని కారుపైకి ఎక్కి మరీ నిరసన తెలిపారు. పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను చెదరగొట్టారు. కారుపైకి ఎక్కిన వ్యక్తిని కిందకు లాగిపడేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.